తాజాగా విజయ్ సేతుపతితో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్న పూరి, ఇందులో టబుకు నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుతం పూరి డిజాస్టర్స్ దశలో ఉన్నారు. మరి ఇలాంటి దర్శకులతో టబు ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఎందుకో ఒప్పుకుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు..
అయితే ఈ దర్శకుడు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చారు. ఇక రానన్న సినిమాలో కూడా ఆయన తనకు చెప్పిన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండడంతో.. టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో షూటింగ్ ప్రారంభం కానుండగా, అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశముంది. ఇది నిజమైతే, టబు కెరీర్‌కు ఇది ఓ సరికొత్త మైలురాయిగా నిలవబోతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు..!!