ఒకప్పుడు హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, కొన్నేళ్ల క్రితం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో, తానే స్వయంగా ఈ విషయం గురించి వెల్లడించారు. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, ఆత్మస్థైర్యం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి, తన ఆరోగ్య స్థితిని ఎందుకు స్వయంగా వెల్లడించాల్సి వచ్చిందో స్పష్టం చేశారు. సోనాలి బింద్రే, క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ‘‘క్యాన్సర్ అనేది జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది – ఒకటి ముందటి జీవితం, రెండు తర్వాతి జీవితం. ఇది నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. మన జీవితం ఏ పరిస్థితుల్లోనైనా ఆగకూడదు. ట్రీట్‌మెంట్ రోజులు నా జీవితంలోని అత్యంత కఠినమైన దశగా మిగిలిపోయాయి’’ అని ఆమె గతంలో కూడా పేర్కొన్నారు..!!