శ్రుతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులను ఉద్దేశిస్తూ, “ప్రియమైన అభిమానులకు..నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ పోస్ట్ అవుతున్నవి నేను చేస్తున్నవి కావు. కాబట్టి, దయచేసి ఆ పేజీలో చేసే పోస్టులు నావి కావని గుర్తించండి. ఖాతాను పునరుద్ధరించే వరకు ఎవరూ స్పందించవద్దు” అని పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు డి. ఇమాన్ ఎక్స్ ఖాతా ఈ ఏడాది మార్చిలో హ్యాక్ అవ్వగా, అది వారం రోజుల క్రితమే పునరుద్ధరించబడింది..
ఇప్పుడు శ్రుతి హాసన్ ఖాతా హ్యాకింగ్‌కు గురవడం గమనార్హం. గతంలో నటి, నిర్మాత ఖుష్బూ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైంది. సామాజిక మాధ్యమాల్లో శృతి హాసన్ చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే, మంగళవారం ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో అసాధారణ కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి. ఆమె అకౌంట్ నుంచి బిట్‌కాయిన్‌కు సంబంధించిన కొన్ని పోస్టులతో పాటు, ఇతర ప్రచార సామగ్రి కూడా షేర్ అవ్వడం అభిమానులను గందరగోళానికి గురిచేసింది..!!