in

actress Samantha going for skin Treatment In USA?

త కొన్నాళ్లుగా సమంత అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా జూలై నెల చివరిలో షూటింగ్ జరిగింది.  ఆ తర్వాత సమంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ కనిపించకపోవడంతో ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ అనేక రకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. కొంతమంది అయితే ఆమె గర్భసంచి కూడా తీయించేసుకుంటుందంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత మేనేజర్ తన మీదకు వచ్చి ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని ఆమె పర్ఫెక్ట్ గా ఉన్నారని త్వరలోనే మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు తాజాగా సమంత గురించి మరో ప్రచారం మొదలైంది. అదేమిటంటే సమంత అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె అనారోగ్యంతో బాధపడడం లేదు కానీ ఒక రకమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమెరికా వెళ్లి ఆమె ఒక హై ప్రొఫైల్ హాస్పిటల్ లో చర్మ చికిత్స చేయించుకోబోతున్నారని తెలుస్తోంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తరువాత ఆమె ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు..!!

‘Sita Ramam’ Combo back on Cards!

CREATER OF “KILIKI LANGUAGE” OF BAHUBALI!