సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకున్న రీతూ జబర్దస్త్ లోకి గెస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడే లేడీ కమెడియన్ గా సెటిల్ అయింది. ఇక తాను కూడా బాగా కామెడీ చేస్తూ ఉండడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆమెను ఆదరించారు. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్న ఈమె అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోలలో పాల్గొని సందడి చేస్తోంది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెట్టే ఈ ముద్దుగుమ్మ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది..
ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆమె ఫాలోవర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక నెటిజన్ నాగచైతన్యను పెళ్లి చేసుకో.. ఆయన కూడా విడాకులు తీసుకునే ఉన్నాడు కదా అనడంతో.. సెల్ఫీ వీడియో ద్వారా ఆ అదృష్టం ఉంటే వెంటనే చేసుకుంటాను అని. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో కొంతమంది జనాలు విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లికి రెడీ అయ్యావంటే ఎంత దిగజారిపోయావో అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!