in

Actress Ramya spandana Compares Mindset Of Men With Dogs!

వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సుప్రీం సూచించింది. ఈ సూచనపై రమ్యతో పాటు దేశవ్యాప్తంగా కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని చెప్పింది. ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యమని..

అందుకే అన్ని వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది..ఈ వ్యాఖ్యలపై రమ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ..మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టమని, వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో తెలియదని, అలాంటప్పుడు పురుషులందరినీ జైలులో పెట్టేయాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యను పురుషులతో పోల్చడం సరికాదని పలువురు మండిపడుతున్నారు..!!

Rashmika mandanna’s Big Remuneration in Demand!

The Raja Saab Reviews!

The Raja Saab Reviews!