నటి రమ్య సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురవుతున్న బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. కన్నడ హీరో దర్శన్ అభిమానులు తనను సోషల్ మీడియా వేదికగా వేదిస్తున్నారని ఆమె వాపోయారు. తనను వేధించిన వారు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరడమేనన్నారు. ‘ఓ హీరో అభిమానులు నన్ను సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తూ మెసేజెస్ చేశారు. వీటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పటికే ఈ అంశంపై నా లాయర్ తో చర్చించాను..
సోషల్ మీడియాను ఇలా దుర్వినియోగం చేయడం బాధాకరం. మహిళలను అగౌరవపరుస్తూ ఇలాంటివారెందరో తప్పించుకుని తిరుగుతూండటం విచారకర’మని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసుపై ఇటివల రమ్య ఓ పోస్ట్ చేశారు. దీనిపై ‘నిన్ను అత్యాచారం చేస్తా’మని కొందరు, ‘రేణుకా స్వామిని బదులుగా నిన్ను హత్య చేసుండాల్సిం’దరి మరికొందరు పోస్టులు చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు స్క్రీన్ షాట్లను కూడా పంచుకున్నారు..!!