
ఈమధ్య శివాజీ అమ్మాయిల గురించి సామాన్లు అన్న మాటలకు అనసూయ ఎంత విపరీతంగా రియాక్ట్ అయిందో తెలిసిందే..అయితే అనసూయ వేరే అమ్మాయి గురించి ఇలాంటి మాటలే అనడం గమనర్హం. ఒక టీవీ షోలో అనసూయ మాట్లాడుతూ, కమెడియన్ జబర్దస్త్ ఆదిని ఉద్దేశించి “నువ్వు రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా?” అని అన్నారు. ఆ సమయంలో అక్కడున్నవాళ్లు నవ్వారు. అప్పటికి ఆ మాటలు పెద్దగా బయటకు రాలేదు..
కానీ తాజాగా ఆ వీడియో క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఈ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ వ్యాఖ్యలపై రాశి చాలా స్పష్టంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “రాశి ఫలాలు అనడం వరకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ‘రాశి గారి ఫలాలు’ అని చెప్పడం అవమానంగా అనిపించింది. అది నా గురించే మాట్లాడినట్టుగా అనిపించింది. అక్కడ జడ్జీలు కూడా నవ్వడం నాకు బాధ కలిగించింది” అని తెలిపారు. ఆ సమయంలో జడ్జిగా రోజా ఉండటం కూడా గమనార్హం..!!
