
స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసినా, నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడం సమస్యలకు దారితీస్తుంది. తాజాగా జరిగిన పరిణామంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. హైదరాబాద్ కూకటపల్లిలోని ఓ మాల్‌లో జరిగిన ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఘటన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది..
ఈవెంట్ మేనేజ్‌మెంట్ లోపాలతో పరిస్థితి అదుపు తప్పి, హీరోయిన్ నిధి అగర్వాల్ జనాల మధ్య నలిగిపోయే పరిస్థితి ఎదురైంది. వేదిక నుంచి ఆమెను బయటకు తీసుకురావడమే పెద్ద సవాలుగా మారింది. అయినా నిధి సంయమనం కోల్పోలేదు. నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినప్పటికీ, ఆమె ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రమోషన్లు కొనసాగించింది. అనుకోని ఇబ్బంది ఎదురైనా ‘రాజాసాబ్’ ప్రచారానికి నిధి ముందుండటం గమనార్హం. దీంతో నిధి అగర్వాల్ సహనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు..!!
