ఇటీవల నయనతార తన రెమ్యునరేషన్ విషయంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓ టాటా స్కై యాడ్ కోసం 50 సెకన్ల కాలానికే ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అంటే సెకనుకు రూ. 10 లక్షలు అన్నమాట! ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగినట్టు సమాచారం. స్టార్ హీరోలే ఒక యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోని సమయంలో, నయనతారకి ఇంత భారీ పారితోషికం అందడం ఆశ్చర్యమే కాదు, ఆమె స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది..
ఒకప్పుడు టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, మోడలింగ్ రంగంలో తన టాలెంట్‌ను చూపించింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్‌గా ఎదిగింది. ఈ రోజు దేశంలోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. కేరళలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన నయనతార, నటనపై ఉన్న మక్కువతో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని టాప్ హీరోయిన్గా మారింది..!!