మామ్యారేజ్ సమయంలో కూడా కొంతమంది నా బరువు గురించి నెగిటివ్ కామెంట్లు చేశారని ఆమె అన్నారు. ట్రోల్స్ నాకు కొత్త కాదని గతంలో కూడా నాపై ట్రోల్స్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నా శరీరంతో నేను సౌకర్యవంతంగా ఉన్నానని మంజిమా మోహన్ అన్నారు. నేను కోరుకున్న సమయంలో నేను బరువు తగ్గ గలనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను నాతో సంతోషంగా ఉన్నానని నేను ఫిట్ నెస్ లో ఉన్నానని మంజిమా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు..
వృత్తిపరమైన నిబద్ధతతో బరువు తగ్గాలని భావించిన సమయంలో బరువు తగ్గడం నాకు కష్టం కాదని ఆమె కామెంట్లు చేశారు. నేను లావుగా ఉన్నంత మాత్రాన ఇతరులకు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదని మంజిమా మోహన్ పేర్కొన్నారు. మంజిమా మోహన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని మంచి కథ దొరికితే త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని ఆమె అన్నారు..