
ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి, ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (L.I.K) సినిమా విడుదలకు సిద్ధమైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్లలో ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి..కృతి శెట్టి మాట్లాడుతూ..తనకు గతంలో ఒకసారి బ్రేకప్ జరిగిందని వెల్లడించింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని, ప్రస్తుతం మాత్రం తాను సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో తనపై నెగిటివిటీ ప్రచారం చేసే వారిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బ్లాక్ చేస్తానని ఆమె క్లారిటీ ఇచ్చింది..!!

