వేదిక ప్రకాశ్ శెట్టి అనే మహిళ 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఈ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో వేదిక నకిలీ బిల్లులతో రూ.76.9 లక్షలను పక్కదారి పట్టించినట్టు పోలీసులు గుర్తించారు..
ప్రయాణాలు, మీటింగ్‌లు, ఇతర ఖర్చుల పేరుతో వేదిక నకిలీ బిల్లులను తయారుచేసి, వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేది. ఆ బిల్లులు అచ్చం అసలువాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి, అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు. ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి-దర్శకురాలు సోనీ రజ్దాన్ ఈ ఏడాది జనవరి 23న జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు..!!