అక్కినేని నాగ చైతన్య రెండో వివాహం ఫిక్స్
సినిమా ఫీల్డ్ లో ఉన్న వారికి రిలేషన్ చేసుకోవడం..అంతే త్వరగా విడిపోవడం చాలా సాధారణంగా జరిగే విషయం..ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు ఊహించని మోస్ట్ షాకింగ్ అండ్ డిస్సపాయింట్ బ్రేకప్ అంటే నాగ చైతన్య – సమంత వాళ్లదే అనే చెప్పాలి..ఎంతో క్యూట్ గ..లవ్లీ పెయిర్..అని అందరు అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా విడిపోతున్నాం అనే వార్త రావడంతో ఆటు అక్కినేని ఫ్యాన్స్ ఏ కాకుండా తెలుగు వారంతా షాక్ కు గురయ్యారు..పెళ్లైన నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం అభిమానులకి ఏ మాత్రం నచ్చలేదు. వారిద్దరు తిరిగి కలిస్తే బాగుండని చాలా మంది అనుకున్నారు కూడా..
ఇరు కుటుంబాలు అంగీకారంతో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం
అయితే అది నిజం అయ్యే ఛాన్స్ ఇప్పుడు ఇక లేదు..ఎందుకంటె చైతన్య మరో పెళ్లి కు రెడీ అయ్యాడు..సమంత నుండి విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నాడని త్వరలో వారిద్దరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం నడించింది ఇన్నాళ్లు..ఇద్దరు కలిసి వెకేషన్‌కి కు వెళ్లడం పిక్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చూసిన నెటిజన్స్ ఈ జంట పెళ్లి పీటలెక్కడం గ్యారెంటీ అని అప్పుడే ఫిక్స్ అయ్యారు..ఈ రోజు వీళ్ల ఎంగేజ్ మెంట్ కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు,మధ్య జరగనుందని సమాచారం. ఇక ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి నాగార్జున అఫీషియల్ ప్రకటన చేస్తాడని ఇన్‌సైడ్ టాక్..!!