నవంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు విజయ్‌పై గాంధీ అనే వ్యక్తి దాడి చేయగా.. అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్, ఇతర భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ విషయంపై పరువు నష్టం దావా వేసిన గాంధీ విజయ్‌పై తాజాగా క్రిమినల్ కేసు పెట్టాడు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నాని, బెంగళూరు ఎయిర్‌పోర్టులో విజయ్‌ని కలిశానని చెప్పాడు.
అప్పుడు వారి ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కూడా నటుడినని, కాబట్టే విజయ్‌ను పలకరించానని చెప్పుకొచ‍్చాడు. అంతేకాకుండా సూపర్ డీలక్స్ చిత్రానికిగానూ విజయ్ సేతుపతికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు అతడిని ప్రశంసించినట‍్లు తెలిపాడు. అయితే విజయ్ మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని,
తన కులాన్ని కించపరిచడాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, దీంతో చెవి పూర్తిగా వినిపించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా అతను విజయ్, అతని మేనేజర్‌పై అస్సలు దాడి చేయలేదని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని విజయ్ సేతుపతి తప్పుడు ప్రచారం చేయడంతో తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, గతంలో రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేశాడు గాంధీ.