అభిషేక్, ఆయన భార్య ఐశ్వర్య వీరిద్దరూ విడిపోతున్నారంటూ దాదాపు ఏడాదిగా వార్తలు వస్తున్నప్పటికీ, ఈ జంట వాటిపై మౌనాన్నే ఆశ్రయించింది. అయితే, తాజాగా ఈ పుకార్లపై అభిషేక్ బచ్చన్ పెదవి విప్పారు. తన కుటుంబంపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ, ఆన్‌లైన్ ట్రోల్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
ఈటైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ, తనపై వచ్చే విమర్శలను గతంలో పెద్దగా పట్టించుకునేవాడిని కాదని, కానీ ఇప్పుడు కుటుంబం ఉన్నందున అవి తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. “ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వార్తలు చాలా బాధపెడతాయి. నేను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా, దాన్ని కూడా వక్రీకరిస్తారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం. నా జీవితం మీరు జీవించడం లేదు. నేను ఎవరికైతే జవాబుదారీగా ఉండాలో, వారు మీరు కాదు” అని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు..!!