మనోజ్ బాజపాయ్ వంటి మంచి నటుడు ఓక సారి ఆత్మ హత్య చేసుకుందాము అనుకున్నారు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో , ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు కాదు. మనోజ్ భాజపాయ్ ఏ పాత్రకయినా ప్రాణ ప్రతిష్ట చేయగల సత్తా ఉన్న జాతీయ స్థాయి నటులలో ఒకరు. అయన ఏడవ తరగతి చదువుతున్న రోజుల నుంచి నటుడు కావాలనే కోరిక బలంగా నాటుకొని పోయింది. అయన తోపాటు ఆ కోరిక కూడా ఎదిగింది, ఇంటర్ తరువాత నాన్న తో అబద్ధం చెప్పి, చదువు నెపం తో ఢిల్లీ చేరారు.
చదువుతోపాటు వీధి నాటకాలు వేస్తూ, నసీరుద్దీన్ షా, ఓంపురి వంటి నటులు నటన నేర్చుకున్న” నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ” లో తాను కూడా నటనలో రాటుతేలాలి అనుకున్నారు. అందులో సీట్ కోసం రెండు సార్లు ప్రయత్నించి విఫలమవడంతో, విరక్తి చెంది ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నారట.” సంభవ ” అనే నటన వర్క్ షాప్ లో పరిచయం అయిన నటన శిక్షకుడి పరిచయం తో, జీవితం పట్ల అవగాహన పెరిగింది. శేఖర్ కపూర్ నిర్మించిన బాండిట్ క్వీన్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయి, రాంగోపాల్ వర్మ నిర్మించిన” సత్య” చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయ్యారు.