in

Aamir Khan rejects Rs 120 crore OTT deal for Sitaare Zameen Par!

వినోద పరిశ్రమలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రాబల్యం బాగా పెరిగింది. సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థలు విడుదలకు ముందే చిత్ర బృందాలకు పెద్ద మొత్తంలో చెల్లించి ప్రసార హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే తరహాలో, ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సుమారు రూ.120 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది..

అయితే, ఆమిర్‌ ఖాన్‌ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని అంటున్నారు. ఓటీటీల కారణంగా థియేటర్లకు వచ్చి సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోతుందనే ఆలోచనతోనే ఆయన ఈ డీల్‌ను వద్దనుకున్నారని చెబుతున్నారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ చిత్రం తర్వాత ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్న సినిమా ఇదే. ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి దివ్య నిధి శర్మ కథ అందించారు. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు..!!

happy birthday kajal agarwal!

Samantha Says No to ‘Ye Maaya Chesave’ Promotions!