టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. తమకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు కాసేపటి క్రితం వీరు ప్రకటించారు. ఇది అఫీషియల్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు..జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైనదని ఆది పినిశెట్టి తెలిపాడు. రెండేళ్ల క్రితం తాము కలిశామని… ఇప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని చెప్పాడు. 24వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.