డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలోనే రష్మిక మందన, సాయి పల్లవిల మధ్య కాంపిటీషన్ ఏర్పడిందట. పుష్ప తో అమ్మడికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మికను హీరోయిన్గా ఫిక్స్ చేయాలని సుకుమార్ భావించాడట. కానీ.. చరణ్ దానికి నో చెప్పేసారని.. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా దూసుకుపోతున్న రష్మిక.. సినిమాలో నటించి సినిమా హిట్ అయిన కూడా ఆ నేమ్ అంతా రష్మిక కి వెళ్తుంది..
ఇక నా క్రేజీ ఏమంటుందని ఆలోచనలో పడ్డాడట. పైగా..రామ్ చరణ్ కు ఎప్పటి నుంచే సాయి పల్లవితో సినిమా చేయాలని ఉంది. పలు ఇంటర్వ్యూలలో సైతం ఇన్ డైరెక్ట్‌గా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్..సాయి పల్లవి తో నటించాలని భావిస్తున్నాడట. కానీ.. మిగతా మేకర్స్ మాత్రం రష్మిక అయితేనే పర్ఫెక్ట్ అని ఆలోచనలు చేస్తున్నారు..ఇప్పుడు ఈ సినిమా విషయంలో హీరోయిన్ ఎవరనే ఫైనల్ డెసిషన్స్ సుక్కుమార్ చేతిలో ఉంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి వర్సెస్ రష్మిక అనే కొత్త హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది..!!