ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఈ సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్రబృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..
నా పేరు సుకుమార్ కాదని సుకుమార్ దేవిశ్రీప్రసాద్ అని తెలియజేశారు. ఎందుకంటే నేను డైరెక్టర్ గా నా సినీ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి దేవిశ్రీప్రసాద్ మాత్రమే నా సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. దేవి లేకుండా నేను ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. నా ప్రతి ఒక్క సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఇకపై దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే నా సినిమాలకు సంగీతం అందిస్తారని ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను అంటూ సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..!!