
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ సీసన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడి ఇప్పుడు దుమారం రేపుతోంది.. నిన్న రాత్రి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి తో గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ కు వెళ్లిన రాహుల్ పై దాడి జరిగింది.. వివరాల్లోకి వెళ్తే, రాహుల్ తో పాటు వచ్చిన అమ్మాయి ను అదే పబ్ లో ఉన్న ఎవరో కొందరు ఏడిపించారట. దీంతో, రాహుల్ ఇంక ఆ యువకుల మధ్య మాటామాటాపెరగడంతో పబ్ లోనే ఘర్షణ జరిగింది.. ఇదే క్రమంలో రాహుల్‌పై కొందరు బీరు సీసాలతో దాడికి దిగారు, తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైనట్టు గ సమాచారం. వెంటనే రాహుల్ ఫ్రెండ్స్ అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయితే రాహుల్ పై దాడి చేసింది రంగారెడ్డి కు చెందిన ఒక ఎమ్మెల్యే బంధువులు అని తెలుస్తుంది. పబ్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.