దాసరి నారాయణ రావు, జె.డి. చక్రవర్తి మధ్య సాగిన రివెంజ్ స్టోరీ, సినీ ఫక్కీలో రివెంజ్ తీర్చుకున్న జె.డి. చక్రవర్తి. అసలు జె.డి. కి దాసరి కి మధ్య అంత రివెంజ్ స్టోరీ నడవటానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు కదూ? దాసరి గారు సినీ పరిశ్రమకు రాక ముందు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో జె.డి.నాన్న గారయిన సూర్యనారాయణ గారికి దాసరి గారి మధ్య మంచి స్నేహం ఉండేది. గవర్నమెంట్ ఎంప్లొయ్ అయిన సూర్యనారాయణ గారు, దాసరి, పద్మ గార్ల వివాహ విషయం లో, ఆర్ధికంగా, సామాజికంగా దాసరి గారికి చాలా సపోర్ట్ చేశారట. ఆ తరువాత దాసరి గారు డైరెక్టర్ అవటం మద్రాస్ కి షిఫ్ట్ అవటం జరిగింది, ఆ తరువాత కూడా ఇద్దరు స్నేహితుల మధ్య మంచి సంబంధాలే నడిచాయి, దాసరి గారు డైరెక్టర్ గ బాగా బిజీ గ ఉంటున్న రోజుల్లో ఒక సారి మద్రాసులో దాసరి గారి ఇంటికి కుటుంబం తో కలసి పలకరించడానికి వెళ్లారు సూర్యనారాయణ గారు, ఆ సమయం లో ఇంట్లో ఉన్న దాసరి గారు, కారణం ఏమిటో కానీ ఖాళీగా ఉండి కూడా చాల బిజీ గ ఉన్నట్లు బిల్డుప్ ఇచ్చి కలవకుండానే వెనుకకు పంపేశారు.
ఆ విషయం సూర్యనారాయణ గారిని చాల బాధించింది, అప్పుడు పదేళ్ల వయసు వాడైన జె.డి., తండ్రిని అంతగా అవమానించిన దాసరి మీద చాలా కోపం పెంచుకున్నాడు. ఆలా సంవత్సరాలు గడిచిపోయాయి. జె.డి. నటుడు అయిన తరువాత, దాసరి గారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది, ఒప్పుకొని డేట్స్ ఇచ్చి కరెక్టుగా రేపు ఉదయం షూటింగ్ అనగా ముందు రోజు ఫోన్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కి నేను రావటం లేదు అని చెప్పాడు.కంగారుపడ్డ అసిస్టెంట్ దాసరి గారికి చెప్పటం తో దాసరి గారే ఫోన్ చేసారు, అయినా కూడా జె.డి. నేను రేపు రావటం లేదు అని ఫోన్ పెట్టేసాడు. ఈ వార్త సినిమా ఇండస్ట్రీ అంత పాకిపోయింది, దాసరి గారికి కూడా అర్ధం కాలేదు. ఆ తరువాత చాలాకాలానికి వేరే సందర్భం లో జె.డి. దాసరి గారిని కలసి నప్పుడు తాను ఎవరు, ఎందుకు ఆ విధం గ చేయవలసి వచ్చిందో చెప్పారట జె.డి.