తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తెరకెక్కుతున్న చాలా సినిమాలు చారిత్రక కధాంశంతో తెరకెక్కుతున్నవే. టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒకేసారి ఇలాంటి కధాంశంతో ఉన్న సినిమాలు తియ్యడం గమనార్హం. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటించబోయే క్రిష్ మరియు పవన్ కల్యాణ్ సినిమా చారిత్రక కధాంశం ఉన్న చిత్రం, బ్రిటిష్ కాలం లో భారత సంపదను దోచుకున్న సంపదను తిరిగి భారత ప్రజలకు తిరిగి ఇచ్చే రాబిన్ హూడ్ తరహా కధతో రూపుదిద్దుకుంటుంది ఈ సినిమా.
కాగా బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్ కూడా భారత చరిత్ర కధాంశంతో కూడిన సినిమా, అల్లూరి సీతా రామ రాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్‌టిఆర్ నటిస్తున్నారు. ఇండియా లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు చాలా క్రేజ్ ఉంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న పీరియాడిక్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. అద్వితీయమైన నటనా ప్రతిభతో అలరించే రాణా 1945 అనే బ్రిటిష్ కాలంలో ఇండియన్ రెబెల్ గా కనిపించబోతున్నారు. కాగా ఒకే సారి మన చరిత్రకు సంబందించిన సినిమాలు రావడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు.