in

a case filed on samantha’s item song by AP Men’s Association!

సినిమా ఎలా ఉన్నా సమంత చేసిన సిజిలింగ్ సాంగ్…ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ సాంగ్ మాత్రం సోషల్ మీడియాని ఉలిక్కిపడేలా చేసింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని దుమ్మురేపి దంచికొట్టింది. అయితే ఈ పాటపై ఇప్పుడు తాజాగా ఒక వివాదం నెలకొంది. సమంత పైన భార్య బాధితుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

ఊఊ అంటావా మావ సాంగ్ ఏకంగా పెద్ద సంచలనమే సృష్టించింది. డీఎస్పీ సమకూర్చిన ఈ మాస్ బీట్ కు యావత్ యూత్ మొత్తం ఫిదా అవుతుంది. ఇక ఈ పాటను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సాంగ్ పైన అనుకోని వివాదం ఒకటి చుట్టుముట్టింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా.. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె కెరీర్ లో చేసిన మొట్ట మొదటి ఐటమ్ సాంగ్ ఇది.

ఈ పాటకి సమంత రెచ్చిపోయి మరి డాన్స్ వేసింది. అయితే ఈ పాట పైన భార్య బాధితుల సంఘం (పురుషులు) కేసుని నమోదు చేసారు. ఈ పాటలోని సాహిత్యం, విజువల్ ఎఫెక్ట్స్ పురుషలని కామాంధులుగా చేసే ప్రయత్నం చేశారని పురుషులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పాటపై ఒక దావా వేశారని వినికిడి. ఈ పాటని పుష్ప సినిమా నుండి తొలగించాలని భార్య భాదితుల సంఘం డిమాండ్ చేసింది.

adah sharma long legs thighs show!

Jr NTR – Mahesh babu ’emk’ episode gets disastrous trp ratings!