
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] ల వైకుంఠపురం’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా అల్లు అర్జున్ కు గట్టి షాక్ ఇచ్చారు యువ రచయిత కృష్ణ.. ‘అల వైకుంఠపురం’ కథ తనదే అంటూ కృష్ణ మీడియా ముందుకు వచ్చాడు. తాను 2005లో చెప్పిన కథతో త్రివిక్రమ్ సినిమాను తీశారు అంటూ గట్టిగ ఆరోపిస్తున్నాడు.. ఈ సినిమాకు ‘దశ-దిశ’ అనే టైటిల్ ని కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశాను అని చెపుతున్నాడు కృష్ణ. డైరెక్టర్ త్రివిక్రమ్ నుండి ఈ విషయం మీద సమాధానం రాకపోతే త్వరలోనే కోర్ట్ ద్వారా లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని చెబుతున్నాడు కృష్ణ. మరి కృష్ణ ఆరోపణల మీద ఇప్పుడు మాటల మాంత్రికుడు ఎలా స్పందిస్తాడో చూడాలి..