రామయాణంలో రాముడిపై హీరో చేప్పే ఓ డైలాగే దీనికి కారణం. ఓ సన్నివేశంలో హరో జై చెప్పే డైలాగ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని సినిమాను తీవ్ర వ్యతిరేకత చూపించారు.మూవీ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసినా. మూవీ మేకర్స్ వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టే మూవీని థియేటర్లో విడుదల చేశారు. థియేటర్లో విడుదలైన సినిమా ఆఖరికి ఓటీటీకీ కూడా వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత వారం ‘అన్నపూర్ణిని’ రిలీజ్ చేసింది. దాంతో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ ట్వీట్ చేశారు నెట్‌ఫ్లిక్స్, మూవీ టీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూవీ వెంటనే నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ‘అన్నపూర్ణి’ సినిమాను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది..!!