
ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఫిలిం నగర్ నుంచి వచ్చిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు విలక్షణ నటుడు షాహిద్ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘RRR’ చిత్రంలో ఆలియా భట్ నటించినప్పటికీ, ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ‘డ్రాగన్’ వార్త నిజమైతే, వీరిద్దరి కాంబినేషన్‌లో పూర్తి నిడివి సీన్స్ చూసే అవకాశం లభిస్తుందని నందమూరి అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఆలియా, షాహిద్ పేర్లు కూడా తోడవ్వడంతో ఈ సినిమా పాన్-ఇండియా రేంజ్ మరో స్థాయికి చేరింది..!!

