in

sandeep reddy opens up about spirit and varanasi release clash!

రోమాంచకం’ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న సంచలన దర్శకుడు, చిత్ర సమర్పకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించారు. ‘స్పిరిట్’ మరియు ‘వారణాసి’ చిత్రాల విడుదల తేదీల మధ్య సమయం సరిపోతుందా అని ఒక విలేకరి పదే పదే ప్రశ్నించగా, సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ‘ఆ రెండు సినిమాల మధ్య దాదాపు 37 రోజుల గ్యాప్ ఉంది, అది సరిపోతుంది. పైగా ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద సినిమా’ అని సమాధానమిచ్చారు. ‘వారణాసి’కి దారి ఇచ్చి ‘స్పిరిట్’ సినిమాను పోస్ట్‌పోన్ చేయాలని మీరు అనుకుంటున్నారా ఏంటి? అని సందీప్ చమత్కరించడంతో అక్కడ నవ్వుల పూవులు పూశాయి. కాగా, ప్రభాస్-సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మార్చి 2027లో విడుదల కానుండగా, మహేష్ బాబు-రాజమౌళిల భారీ చిత్రం ‘వారణాసి’ ఏప్రిల్ 2027లో ప్రేక్షకు ముందుకు రానుంది..!!

Kriti Sanon’s Rakhi Ad Pulled down amid controversy!