in

Trisha says yes for supernatural thriller series for Prime Video!

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాలుగా తనదైన శైలిలో రాణిస్తున్న త్రిష డిజిటల్ మాధ్యమంలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే ‘బృంద’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు మరోసారి ఒక క్రేజీ తెలుగు వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నందిని రెడ్డి ఈ కొత్త సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా ఒక సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కనుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి త్రిష ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై డిజిటల్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ త్రిష తన దూకుడును కొనసాగిస్తోంది.!!

hollywood star Will Smith in Allu Arjun’s ‘Raaka’?