
వీరసింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని మళ్ళీ జతకట్టడంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యను మరింత పవర్‌ఫుల్ లుక్‌లో చూపించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, తాజాగా లక్ష్మీరాయ్ ఎంట్రీతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ యాక్షన్ మరియు పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో లక్ష్మీరాయ్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె ఎంట్రీతోనే సినిమాలో అసలైన ట్విస్ట్ మొదలవుతుందని, అందుకే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో బాలకృష్ణతో కలిసి ‘అధినాయకుడు’ సినిమాలో లక్ష్మీరాయ్ నటించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ బాలయ్య సినిమాలో ఆమెకు అవకాశం రావడం, అది కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు లక్ష్మీరాయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు..!!

