in

Prabhas gifts Raja Saab crew​​ As a token of appreciation for their work!

ప్రభాస్ మరోసారి తన ఉదారతతో అభిమానుల మనసు దోచుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సినిమా కోసం పనిచేసిన సిబ్బందిని ప్రభాస్ మర్చిపోలేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి, చిత్ర బృందానికి ఆయన ప్రత్యేకంగా బోనస్‌లు అందజేశారు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, కష్టపడ్డ టీమ్‌కు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధాన సాంకేతిక విభాగాల వారికి ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున, గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసిన సిబ్బందికి రూ.10,000 చొప్పున ప్రభాస్ స్వయంగా బోనస్ అందించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు ఆయన మనసు ఎంతో గొప్పదని ప్రశంసిస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.205 కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ, అంచనాల్ని అందుకోలేకపోయింది..!!

Akhil Akkineni touching rayalaseema faction backdrop for lenin!