in

Rashmika opens up on online negativity and rumors!

బ్లిక్ లైఫ్ లో ఉండే తారలపై రూమర్లు తప్పవని నటి రష్మిక మందన్న చెప్పారు. కొన్ని రూమర్లు ఎంతగానో బాధిస్తాయని తెలిపారు. అయితే, రూమర్లు సృష్టించే వారు కేవలం వ్యూస్ తో వచ్చే డబ్బు కోసమే ఆ పని చేస్తారని రష్మిక అన్నారు. ఓ చిట్ చాట్ లో అభిమానుల ప్రశ్నలకు జవాబులిస్తూ రష్మిక పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ‘‘మీడియాలో, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది రూమార్లు సృష్టిస్తుంటారు.. నిజం చెప్పాలంటే ఆ వార్తలు కూడా ఎంతోమందిని పోషిస్తున్నాయి. అందుకే బతకనీ లెమ్మని వదిలేస్తా” అంటూ రష్మిక ఓ అభిమానికి జవాబిచ్చారు.

జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు..ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి అంటూ తనపై వచ్చిన రూమర్లపై రష్మిక స్పందించారు. అది నిజమైతే బాగుండని తాను కూడా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తాను హీరోయిన్ గా నటించే సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేయడానికి సిద్ధమేనని చెప్పారు. ఇండస్ట్రీలోని ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను హీరోయిన్ కాకున్నా సరే వారి సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేయడానికి సిద్ధమని రష్మిక తెలిపారు. అయితే, ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం రష్మిక వెల్లడించలేదు..!!

happy birthday krishnam raju!

f cube ‘Dimple Hayathi’