
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. కాగా తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో సాగుతుందని తెలుస్తోంది.
ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా భారీ యాక్షన్ తో సాగుతుందని.. అలాగే వైల్డ్ విజువల్ వండర్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది..!!

