
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితం, బోల్డ్ కామెంట్స్‌తోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసే ఈ బ్యూటీ, తాజాగా తన విడాకులు, బ్రేకప్స్, రిలేషన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ మలైకా ఇలా చెప్పుకొచ్చింది. “నేను పెళ్లి చేసుకున్నాను.. విడిపోయాను. ఆ తర్వాత మరో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, అది కూడా బ్రేకప్ అయ్యింది. అంతమాత్రాన ప్రేమ అనే కాన్సెప్ట్ తప్పని నేను అనుకోను..
ఆ బంధాలు నాకు సెట్ కాలేదు అంతే! కానీ నాకు ఇప్పటికీ ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రేమను పొందడం, పంచడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను.” అని మలైకా అరోరా చెప్పుకొచ్చింది..ఇదే సందర్భంలో నేటితరం అమ్మాయిలకు మలైకా ఒక విలువైన సూచన చేసింది. “ఆడపిల్లలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తప్పు చేయకండి. పెళ్లి పీటలు ఎక్కేముందే జీవితం గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా, మానసికంగా మన కాళ్ల మీద మనం నిలబడటం నేర్చుకోవాలి. ఆ స్వతంత్రం వచ్చాకే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి” అని ఆమె హితవు పలికింది..!!