in

Sreeleela Opens Up About Adopting Two Children At 21

కేవలం 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తెరపై నటిగా అలరిస్తూనే, తెర వెనుక బాధ్యతగల పౌరురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమ్మలా కాదు.. ఒక ప్రత్యేక బంధం ఈ దత్తత విషయంపై తాజాగా స్పందించిన శ్రీలీల, తన మనసులోని భావాలను ఆత్మీయంగా పంచుకుంది. “ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు, కాస్త వణుకుగా కూడా ఉంటుంది. కానీ ఆ పిల్లలను నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను..

నేను వాళ్లకు ఒక సాధారణ అమ్మలా ఉండను, దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది” అంటూ తన ప్రయాణం గురించి ఎమోషనల్‌గా వివరించింది. తన కెరీర్ ఆరంభంలో ‘కిస్’ సినిమా సమయంలో ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధమే ఈ నిర్ణయానికి కారణమని ఆమె తెలిపింది. నిజానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ, మరికొంత మందిలో సేవా భావం కలగాలనే ఉద్దేశంతోనే బయటకు చెప్పినట్లు వెల్లడించింది. 2022లోనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల, తన గొప్ప మనసుతో నిజమైన ‘స్టార్’ అనిపించుకుంటోంది..!!

Anasuya apologises to Raasi over double-meaning joke!

Rashmika mandanna’s Big Remuneration in Demand!