in

Vijay Deverakonda and Rashmika are all set to tie knot soon?

టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంటకు 2025 అక్టోబర్ 3నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో జరగబోయే పెళ్లి కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా ఉండనుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే, విజయ్ కానీ, రష్మిక కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..!!

Roja reacts about her daughter’s rumoured entry into films!

riddhi kumar reveals reason why prabhas gifted her a white saree!