
ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి చాలా వరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ.. ప్రభాస్‌తో సినిమా అంటే అది ఏ పాత్ర అయినా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని గోపీచంద్ ఒక టైం లో వివరించాడు. అందులో భాగంగానే పవర్ఫుల్ విలన్ పాత్రను సందీప్ రెడ్డివంగా గోపీచంద్ కోసం డిజైన్ చేశాడట. ఈ విషయాన్ని గోపీచంద్ కు చెప్పగానే తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రీసెంట్గా సందీప్ వంగా ఆఫీసుకు గోపీచంద్ వెళ్లి..
అక్కడ వాల్ పై ఉన్న చిరంజీవి ఫోటోతోను అలాగే సందిప్ రెడ్డి వంగతోను ఫోటో దిగాడు. సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే స్సిరిట్ విలన్‌గా గోపీచంద్ నటిస్తున్నాడనే దానిపై సందీప్ త్వరలోనే అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నాడట..తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్‌గా గోపీచంద్ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్.. గోపీచంద్‌కు మధ్యన మంచి బాండ్ ఉంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు..!!
