
జైలర్’ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులను అలరించారు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ‘జైలర్ 2’ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత రెట్టింపు చేశాయి..
మిథున్ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సీక్వెల్‌లో షారుక్ ఖాన్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ కీలక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ పేరు అధికారికంగా వినిపించడంతో, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు..!!

