in

Allu Arjun and Trivikram reunite for Rs 1000 crore budget film?

కాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్‌ కాంబో నాలుగోసారి పునరావృతం కానుందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది..

మీడియా కథనాల ప్రకారం, ఈసారి వీరి కలయికలో ఓ భారీ పౌరాణిక చిత్రం రానుందని సమాచారం. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో, సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్, విజువల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

kajol devgn on board for Jr NTR–Prashanth Neel Film?

Tamannaah Bhatia was removed from Aditya Dhar’s Dhurandhar?