in

Rakul Preet singh re-entry into Tollywood!

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ కడాలి చక్రవర్తి (చక్రి) కొత్తగా ఏర్పాటు చేసిన “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ”ని రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

“నాకు తొలి విజయాన్ని అందించింది తెలుగు సినిమానే. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడంతో అందరినీ చాలా మిస్ అవుతున్నాను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తాను. నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి” అని రకుల్ కోరారు. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలనే కోరిక బలంగా ఉందని, ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని ఆమె వెల్లడించారు..!!

Actress Nidhi Agarwal Mobbed at Hyderabad public event!

kajol devgn on board for Jr NTR–Prashanth Neel Film?