
డాక్టర్ శివ రాజ్‌కుమార్ మరియు ధనంజయ ప్రధాన పాత్రల్లో, హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్ట్ *‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’*లో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ అధికారికంగా చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించడంతో సినిమా చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుభవం కలిగిన స్టార్ హీరోయిన్..
ఓజి, సరిపోదా శనివారం, కెప్టెన్ మిల్లర్, డాక్టర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన పాత్రలతో ప్రశంసలు అందుకున్న ప్రియాంక ఇప్పుడు 80ల నేపథ్యంలో తెరకెక్కుతున్న బాండ్-ఎస్క్యూ స్పై డ్రామాలో కీలక పాత్రలో నటించబోతున్నారు. “డాక్టర్ శివ రాజ్‌కుమార్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం రావడం నా కల నిజమైనట్టే. ప్రతిభావంతుడైన ధనంజయతో కలిసి నటించడం, ఇంత పెద్ద తారాగణంలో భాగమవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హేమంత్ ఎం. రావుతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో ఉంది, అది ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించలేదు” అని ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ప్రియాంక మోహన్ తెలిపారు..!!
