in

anupama achieves a rare record in 2025!

లయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆమె సౌత్ ఇండియా సినిమాల్లో తన నటనతో పాటు అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఈ బ్యూటీ తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి మలయాళంతో పాటు టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీల్లో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఈ చిన్నది 2025లో ఓ రేర్ ఫీట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఏడాదిలో ఏకంగా ఏడు సినిమాలను రిలీజ్ చేసిన ఘనత అనుపమ పరమేశ్వరన్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఆమె డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆమె నటిస్తున్న మరో చిత్రం లాక్‌డౌన్ డిసెంబర్ 5న రిలీజ్‌కు రెడీ అయింది. ఇలా ఒకే ఏడాదిలో ఏకంగా ఏడు సినిమాలను రిలీజ్ చేస్తున్న హీరోయిన్‌గా అనుపమ తనదైన రికార్డును క్రియేట్ చేసింది. మరి అనుపమ సెట్ చేస్తున్న ఈ రికార్డును ఎవరు బద్ధలు కొడతారో వేచి చూడాలి..!!

Keerthy Suresh expresses shock over AI fake photos!