
బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ హీరోగా రానున్న ‘కల్కి’ సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమాల్లో నటించకపోవడానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని, ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన తొలి ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. “సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 కోట్లా అనేది నా నిర్ణయాలపై ప్రభావం చూపదు. కొందరు భారీ పారితోషికం ఆఫర్ చేస్తారు. కానీ నాకు అది ముఖ్యం కాదు” అని ఆమె తెలిపారు. సినిమా స్థాయిని బట్టి తన ప్రాధాన్యతలు మారవని ఆమె పరోక్షంగా వెల్లడించారు. ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్నప్పుడే ఉత్తమమైన నటనను ఇవ్వగలమని దీపిక పేర్కొన్నారు..!!

