in

Keerthy Suresh’s ‘Revolver Rita’ Gets A Release Date!

స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ గత కొంత కాలం నుంచి ఒక సరైన హిట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ ఇంకా డైరెక్ట్ ఓటిటిలో వచ్చిన సినిమాలు కూడా తనకి బ్రేక్ ఇవ్వలేదు. ఇక తన నుంచి నెక్స్ట్ రాబోతున్న మరో చిత్రమే “రివాల్వర్ రీటా”. దర్శకుడు జేకే చంద్రు తెరకెక్కించిన ఈ సినిమా ఎపుడో రిలీజ్ కావాల్సింది మధ్యలో కొన్ని డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంది కానీ వాయిదా పడింది..

మరి ఫైనల్ గా ఈ సినిమాకి మరో కొత్త డేట్ ని అయితే లాక్ చేసుకుంది. దీనితో ఈ నవంబర్ 28న థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. అదే రోజున రామ్ పోతినేని సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా కూడా రిలీజ్ కి ఉంది. మరి ఆ సినిమాతో ఈ సినిమా తెలుగు ఇంకా తమిళ్ లో కూడా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి సియన్ రోల్డన్ సంగీతం అందించగా ఫ్యాషన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు..!!

jhanvi kapoor confirmed on board for allu arjun – atlee film!