
కెర్యాంప్ సినిమా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వేడుకలో హీరో విజయ్ దేవరకొండను పరోక్షంగా ఉద్దేశిస్తూ కొన్ని మాటలు చెప్పారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో విజయ్ అభిమానులు బండ్ల గణేష్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో బండ్ల గణేష్ స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు..
తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ‘‘ఇటీవల కె ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరికైనా నా మాటల వల్ల అనుభవించిన బాధకు సారీ’’ అంటూ బండ్ల గణేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు..!!
