in

Shah Rukh Khan Copies Brad Pitt’s F1 Style? See Pics!

షారుఖ్ ఖాన్ లుక్ పై కాపీ ట్రోల్ల్స్!
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “కింగ్” నుంచి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నేడు కింగ్ ఖాన్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో షారుఖ్ లుక్ ఓకే కానీ తన గెటప్ కొన్ని షాట్స్ పై గట్టి ట్రోల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎఫ్ 1 లో హీరో బ్రాడ్ పిట్ లుక్ ని షారుఖ్ తో అచ్చు గుద్దినట్లు దించేయడంతో కాపీ మరకలు పడ్డాయి..

బ్రాడ్ పిట్ స్టైల్ ను కాపీ చేసిన షారుఖ్ ఖాన్!
రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టి మరీ నెటిజన్లు సోషల్ మీడియాలో మేకర్స్ వీక్ వర్క్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంచెం అటు ఇటుగా షారుఖ్ హెయిర్ స్టైల్ కూడా బ్రాడ్ పిట్ ని మ్యాచ్ చేయడంతో సిద్ధార్థ్ ఆనంద్ మరోసారి ఇలా బుక్కయ్యాడు. ఇది వరకే సాహో సినిమాలో ఎయిర్ జెట్ సీక్వెన్స్ కూడా పఠాన్ లో షారుఖ్ తో చేయడంపై కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి..!!

Rajinikanth to retire from cinema after 2027?

Suriya Back To Back films With Telugu Directors!