
తమిళంలో దుల్కర్ జోడీగా ‘కాంత’ .. తెలుగులో రామ్ సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలు చేస్తూ వెళ్లింది. ‘కాంత’నవంబర్ 14వ తేదీన విడుదలవుతుంటే, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 27వ తేదీన విడుదల కానుంది. ‘కాంత’ టైటిల్ తోనే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు 1950లలో నడిచే కథ కావడం వలన ఆడియన్స్ మరింత కుతూహలంతో ఉన్నారు..
ఆ కాలం నాటి లుక్ తో భాగ్యశ్రీ కొత్తగా కనిపిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఇక రామ్ తో చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లోను ఆమె పాత్ర డిఫరెంట్ గా అనిపిస్తోంది. చాలా తక్కువ గ్యాప్ లో ఒకదాని తరువాత ఒకటిగా విడుదలవుతున్న ఈ సినిమాలు, ఆమె కెరియర్ గ్రాఫ్ ను పెంచుతాయేమో చూడాలి..!!

