
నందమూరి బాలకృష్ణ, నయనతార మంచి కాంబినేషన్. శ్రీరామరాజ్యం, సింహా, జై సింహా..ఇలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ అభిమానుల్ని అలరించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడీ చూడబోతున్నాం. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది..
సినిమాలో కథానాయికగా నయనతారని ఎంచుకొన్నారు. ఇటీవలే దర్శకుడు గోపీచంద్ మలినేని నయనతారని కలిసి కథ చెప్పారు. నయనతారకు ఈ కథతో పాటు, తన పాత్ర కూడా బాగా నచ్చిందని, వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. సాధారణంగా బాలయ్య సినిమాల్లో ఇద్దరు ముగ్గురు నాయికలు ఉంటారు.. ఈ సినిమాలో కూడా మరో నాయిక ఉండే అవకాశం వుంది. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది..!!

