తెలుగు ప్రేక్షకులకు ‘బద్రి’, ‘నాని’ చిత్రాలతో సుపరిచితురాలైన సీనియర్ బాలీవుడ్ నటి అమీషా పటేల్, 50 ఏళ్ల వయసులోనూ తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమె తొలిసారిగా వివరించారు..
గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే వారిలో ఎవరి దగ్గరా నిజాయతీ కనిపించలేదని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవితంలో చాలా మందితో ప్రేమాయణం నడిపాను. కానీ ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదు. అందరూ నన్ను ఒక స్త్రీగా నా శరీరాన్ని మాత్రమే చూశారు. నా ఆలోచనలకు, నిర్ణయాలకు గౌరవం ఇవ్వలేదు” అని ఆమె తెలిపారు. నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూశానని, అందుకే సంబంధాలు పెళ్లి వరకు వెళ్లలేదని స్పష్టం చేశారు..!!